Stock Market: ఫ్లాట్‌గా నెలారంభంలో సూచీలు.. యూఎస్ అందించిన బిగ్ రిలీఫ్..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నెల మెుదటి ట్రేడింగ్ రోజును ఫ్లాట్ గా ప్రారంభించాయి. నిన్న భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు అదే ధోరణిని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉదయం 9.33 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 24 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ మాత్రం 16 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 82 పాయింట్లు నష్టంలో ఉంది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 105 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అయితే మార్కెట్లు తేరుకుని లాభాల్లో కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న అమెరికా డెట్ సీలింగ్ ఉత్కంఠకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. యూఎస్ లోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. దీంతో ట్రెజరీ పెట్టిన గడువుకు 5 రోజులు ముందుగానే సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో అమెరికా ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు చేసేందుకు మార్గం సుగమం అయ్యింది.
NSEలోని అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, బజాజ్ ఆటో, టీసీఎస్, హిందుస్థాన్ యూనీలివర్, హిందాల్కొ, డాక్టర్ రెడ్డీస్, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, నెస్లే, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో కోల్ ఇండియా, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, మారుతీ, బ్రిటానియా, పవర్ గ్రిడ్, గ్రాసిమ్, యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్జూమర్స్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లా కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications