Stock Market: కొత్త వారం ఫ్లాట్ ప్రారంభం.. మిశ్రమ మార్కెట్లతో సూచీల కదలికలు..
Stock Market: గతవారం భారీ నష్టాలను నమోదు చేసిన భారత మార్కెట్లు.. కొత్త వారం ప్రయాణాన్ని ఒడిదొడుకుల్లో ప్రారంభించాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ఉదయం 9.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్(sensex) 72 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ(nifty) 30 పాయింట్లను కోల్పోయి ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 38 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 53 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అయితే గిఫ్ట్ నిఫ్టీ కదలికలు పాజిటివ్ గా ఉండటంతో అందరూ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమౌతాయని భావించారు.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, యూపీఎల్, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్జూమర్, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఎల్ టి, ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, ఎల్ టిఐఎమ్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎయిర్ టెల్, బీపీసీఎల్, హిందాల్కొ, దివీస్ ల్యాబ్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications