Stock Market: దలాల్ స్ట్రీట్ లో బీజేపీ పవనాలు.. మార్కెట్లపై ఎలక్షన్ రిజెల్ట్స్ ఎఫెక్ట్
Stock Market: రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను వరుసగా 5వ సారి పెంచిన తరుణంలో నిన్న స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసిందే. అయితే ఈరోజు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో జరుగుతున్న ఒట్ల లెక్కింపు ప్రభావం స్టాక్ మార్కెట్లపై నేరుగా ఉంది. ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా మార్కెట్లు ప్రభావితం కావటం సహజం.

బీజేపీ పవనాలు..
మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ గెలుస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ ప్రభావం మార్కెట్లపై ఉన్నప్పటకీ అవి ఫ్లాట్ గా ప్రారంభమై మధ్యాహ్నం సమయానికి కూడా అలాగే కొనసాగుతున్నాయి. మరో పక్క హిమాచల్ లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ కొనసాగుతోంది. దలాల్ స్ట్రీట్ లో వడ్డీ రేట్ల ప్రతికూలతకు వ్యతిరేకంగా మోదీ వేవ్ కొనసాగుతున్నప్పటికీ అది చాలా ఫ్లాట్ గానే ఉందని నిపుణులు అంటున్నారు.

మార్కెట్ సూచీలు..
మధ్యాహ్నం 11.53 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 58 పాయింట్లు, నిఫ్టీ సూచీ 19 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం 332 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఎందుకంటే పెరిగిన వడ్డీ రేట్లు బ్యాంకులకు వడ్డీ ఆదాయాన్ని పెంచుతాయి కాబట్టి మదుపరులు ఆ రంగం షేర్లపై తమ బులిష్ పోకడిని కొనసాగిస్తున్నారు. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 117 పాయింట్ల లాభంలో కొనసాగటం గమనార్హం.

టాప్ గెయినర్స్..
ఈ క్రమంలో ప్రధానంగా లాభపడిన స్టాక్ లలో యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఎల్ అండ్ టీ, హిందాల్కొ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, గ్రాసిమ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్జూమర్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్ తో పాటు మరిన్ని కంపెనీలు లాభాల్లో టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
సన్ ఫార్మా, కోటర్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, దివీస్ ల్యాబ్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, అపోలో హాస్పిటల్, విప్రో, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్, హీరో మోటోకార్ప్, ఐటీసీ, టెక్ మెహీంద్రా, హెచ్డీఎఫ్సీ తో పాటు మరిన్ని కంపెనీలు నష్టాల్లో టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications