Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు.. యూఎస్ మార్కెట్ ఎఫెక్ట్..
Stock Market: నిన్న లాభాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ స్టార్ట్ తో ట్రేడవుతున్నాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లు నెగటివ్ గా క్లోజ్ కావంటతో.. ఆసియా మార్కెట్లు సైతం ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 5 పాయింట్ల స్వల్ప నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 2 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 28 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 14 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది.

ఇదే క్రమంలో రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమావేశాలు ప్రారంభమౌతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు దిశానిర్ధేశం కోసం ఎదురుచూస్తూ ఆచితూచి ముందుకు కొనసాగుతున్నారు. ఆసియా మార్కెట్లు సైతం బలమైన సపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది.
ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటార్స్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, ఎల్ టి కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
ఇదే సమయంలో సూచీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టీసీఎస్, సిప్లా, టాటా కన్జూమర్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, హిందుస్థాన్ యూనీలివర్, దివీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications