Stock Market: స్వల్ప లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.. వారాంతంలో నెమ్మదిగా ముందుకు..
Stock Market: వారం చివరి రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని ఫ్లాట్ ప్రారంభంతో మెుదలుపెట్టాయి. నిన్న భారీ ఒడిదుడుకుల తర్వాత ప్రస్తుతం స్వల్ప లాభాలతో ముందుకు సాగుతున్నాయి.
ఉదయం 9.21 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో ముందుకు కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 29 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 103 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో సిప్లా, దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, ఎల్ టిఐమ్, గ్రాసిమ్, హిందాల్కొ, సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్ టి, పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మారుతీ, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, యూపీఎల్, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, హిందుస్థాన్ యూనీలివర్, బ్రిటానియా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎయిర్ టెల్, విప్రో, బీపీసీఎల్, టాటా కన్జూమర్, నెస్లే, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications