Stock Markets: స్టాక్ మార్కెట్లలో క్రూడ్ కల్లోలం.. బ్యారెల్ 100 డాలర్లకు చేరుతుందా..? కేంద్రం బిగ్ స్కెచ్
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం స్తబ్ధుగా ఉన్నాయి. OPEC+ దేశాలు తమ చమురు ఉత్పత్తిని తగ్గించాలని అకస్మాత్తుగా నిర్ణయించటంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. చమురు ఉత్పత్తిదారులు తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా రానున్న కాలంలో బ్యారెల్ చమురు ధర 100 డాలర్ల మార్కును చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు నేడు 8 శాతం పెరిగాయి.
ఉదయం 10.04 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 9 పాయింట్లు, నిఫ్టీ సూచీ 6 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 35 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 81 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లు సైతం ఆచితూచి మార్కెట్లను గమనిస్తున్నారు.

ఇప్పటికే ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసేందుకు సెంట్రల్ బ్యాంకులు తమ మానిటరీ పాలసీని టైట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇంధన ధరల భారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను మాంద్యంలోకి నెట్టేసే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ భారం వాహనదారులతో పాటు ఆహార ఉత్పత్తులపై కూడా పడనుంది. అయితే దేశంలో కర్ణాటక ఎన్నికలు దగ్గరపడిన వేళ కేంద్రం ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరల పెంపును తాత్కాలికంగా నిలిపివేయవచ్చని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత తిరిగి బాదుడు మెుదలయ్యే అవకాశం ఉంది.
NSE సూచీలో ఓఎన్జీసీ, హీరో మోటార్స్, మారుతీ, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, యూపీఎల్, ఐషర్ మోటార్స్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎయిరె టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ తో పాటు మరిన్ని కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో బీపీసీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందుస్థాన్ యూనీలివర్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, సిప్లా, టీసీఎస్, హిందాల్కొ, నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీతో పాటు మరిన్ని కంపెనీలు నష్టాల్ కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications