Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి బుల్ ర్యాలీ తర్వాత నేటు ఫ్లాట్ ఆరంభాన్ని చూశాయి. దీంతో నిన్నటి బుల్ ర్యాలీతో కొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరిన బెంచ్ మార్క్ సూచీలు నేడు స్వల్ప ఒడిదొడుకుల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.40 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 11 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 7 పాయింట్ల నష్టంలో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 60 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 57 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా సూచీల గరిష్టాల ప్రయాణంతో మార్కెట్లు స్వల్పంగా సైడ్‌వేస్‌లో ప్రయాణాన్ని సాగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఎన్ఎస్ఈలో అల్ట్రాటెక్ సిమెంట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్, ఎల్ టిఐఎమ్, గ్రాసిమ్, ఎల్ టి, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, రిలయన్స్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇన్ఫోసిస్, బ్రిటానియా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో హిందాల్కొ, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా కన్జూమర్, హీరో మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, సిప్లా, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications