Stock Market: స్తబ్ధుగా మార్కెట్లు.. ఒడిదొడుకుల్లో బ్యాంకింగ్ స్టాక్స్..
Market Trends: దేశీయ స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని నేడు ఫ్లాట్ గా ప్రారంభించాయి. నిన్నటి భారీ లాభాల పరుగు తర్వాత నేడు మార్కెట్లు కొంత స్తబ్ధతను కొనసాగిస్తున్నాయి.
ఉదయం 10.03 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంలో ఉండగా, నిఫ్టీ సూచీ 16 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 19 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 187 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో పవర్ స్టాక్స్ టాప్ గెయినర్లుగా ట్రెండ్ అవుతున్నాయి.

ఎన్ఎస్ఈలో బీపీసీఎల్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టైటాన్, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్స్, టెక్ మహీంద్రా, ఎల్ టి, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్‌టిఐఎమ్, హిందాల్కొ, శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్స్, సన్ ఫార్మా, టీసీఎస్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, నెస్లే, ఐటీసీ, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications