Stock Market: కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజే నిఫ్టీ రికార్డులు.. లాభాలతో ప్రయాణం మెుదలు..
Market Opening: భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు తమ ప్రయాణాన్ని లాభాలతో మెుదలుపెట్టాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో సూచీల ర్యాలీ దేశీయ ఇన్వెస్టర్లలో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
ఉదయం 9.42 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 480 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 166 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 416 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 533 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతున్నాయి. దీనికి తోడు నాలుగో త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఫలితాలతో పాటు అమెరికా డేటా మార్కెట్లను ముందుకు నడిపిస్తోందని తెలుస్తోంది.

ఈ క్రమంలో నిఫ్టీ సూచీ సరికొత్త రికార్డు స్థాయి 22,529.95 మార్కును అందుకుంది. పెట్టుబడిదారులు బేరం వేటను ఆశ్రయించే అవకాశం ఉందని, ద్రవ్యోల్బణం ముందు సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ ఏడాది 3 రేట్ల తగ్గింపును పరిశీలిస్తున్నట్లు యూఎస్ ఫెడ్ ఇటీవల పునరుద్ఘాటించడం మార్కెట్లను మంచి స్థితిలో ఉంచుతుందని భావిస్తున్నట్లు మెహతా ఈక్విటీస్ సీనియర్ VP ప్రశాంత్ తాప్సే చెప్పారు.
జేఎస్డబ్ల్యూ స్టీల్, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, ఎల్ టి, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్, హిందాల్కొ, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఆటో, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎయిర్ టెల్, మారుతీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications