Opening Bell: గత శుక్రవారం మెగా ర్యాలీలో కొనసాగిన బెంచ్ మార్క్ సూచీలు జూలై చివరి వారాన్ని లాభాలతో మెుదలుపెట్టాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ తమ సరికొత్త జీవితకాల గరిష్ఠాల వద్ద ప్రయాణాన్ని ఆరంభించాయి.
నేడు మార్కెట్ల ప్రారంభంలో బుల్స్ జోరుతో సెన్సెక్స్ సూచీ 81749 పాయింట్ల సరికొత్త గరిష్ఠాన్ని చేరుకోగా.. నిఫ్టీ సైతం ఇదే దారిలో కొనసాగి 24980 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో ఉదయం 9.32 గంటల సమయంలో సెనెస్స్ 325 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 82 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 528 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతుండగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 528 పాయింట్ల పెరుగుదలతో ఇంట్రాడేలో లాభదాయకంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో కార్పొరేట్ క్యూ1 ఫలితాల తర్వాత బంధన్ బ్యాంక్ షేర్లు నేడు 9 శాతం లాభపడ్డాయి.

ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, ఎల్ టి, అల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా మోటార్స్, రిలయన్స్, మారుతీ, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఆటో, విప్రో, కోల్ ఇండియా, ఎల్ టిఐఎమ్, హిందాల్కొ, దివీస్ ల్యాబ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో సిప్లా, టాటా కన్జూమర్, టైటాన్, ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్, హీరో మోటార్స్, ఐటీసీ, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications