Market Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఎన్నికల ఫలితాల శంఖారావం పూరించాయి. ఫలితాల అంచనాలు మళ్లీ దేశంలో మోదీ సర్కార్ తిరిగి వస్తుందని తేల్చేయటంతో ఇన్వెస్టర్లలోని బుల్ జోరు మేల్కొంది. దీంతో సెన్సెక్స్ నిఫ్టీలు ఆరంభంలోనే సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుకోగా.. ఆటో రంగానికి చెందిన షేర్లు ఫోకస్ లో కొనసాగుతున్నాయి.
నేడు ఆరంభంలోనే బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 600 పాయింట్లకు పైగా గెయిన్ అయ్యింది. వాస్తవానికి ప్రీపోల్స్ సమయంలో ఎన్డీఏ కూటమికి 300 కంటే తక్కువ సీట్లు వస్తాయనే అంచనాలు ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేశాయి. ఈ క్రమంలో చాలా మంది విదేశీ ఇన్వెస్టర్లు తమ డబ్బును వెనక్కి తీసుకున్నారు. కానీ తాజా అంచనాలు మోదీకే తిరిగి ప్రజలు పట్టం కట్టనున్నట్లు తేల్చేయటంతో స్టాక్ మార్కెట్లలో బుల్స్ దూసుకుపోతున్నారు.

ఉదయం 9.32 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1982 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 600 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1423 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1260 పాయింట్లు గెయిన్ అయ్యింది. ప్రధానంగా విదేశీ మదురులు తిరిగి ఈక్విటీల్లోకి డబ్బును ఇన్వెస్ చేయటం పరుగులకు కారణంగా బ్రోకరేజ్ సంస్థల డేటా చెబుతోంది.
ఈ క్రమంలో అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టి, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ముందుకు సాగుతున్నాయి. కేవలం ఎల్ టిఐఎమ్ షేర్లు మాత్రమే టాప్ లూజర్లుగా ఎన్ఎస్ఈలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications