Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు బడ్జెట్ తర్వాత రోజు నష్టాల నుంచి కొంత తేరుకున్నట్లు కనిపించినప్పటికీ నేడు భారీ నష్టాల్లో ప్రయాణాన్ని ప్రారంభించాయి. ప్రధానంగా అమెరికా, ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగటం దేశీయ మార్కెట్లను నష్టాల్లో నడవటానికి ముఖ్య కారణాల్లో ఒకటిగా నిలిచింది.
మార్కెట్లు భారీ నష్టాల్లో ఉదయం తెరుచుకోగా 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతుండగా.. మరో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ 178 పాయింట్ల నష్టంతో ముందుకు సాగుతోంది. ఇంట్రాడేలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 565 పాయింట్ల పనంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 310 పాయింట్ల మేర క్షీణతను ఆరంభంలో చవిచూశాయి. ఇదే క్రమంలో యాక్సిస్ బ్యాంక్ స్టాక్ నష్టాల్లో క్యూ1 ఫలితాల తర్వాత ముందుకు సాగుతోంది. ప్రధానంగా కంపెనీ అసెట్ క్వాలిటీ తగ్గటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

NSEలో నేడు ఎస్బీఐ లైఫ్, టాటా మోటార్స్, ఎల్ టి, నెస్లే, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్స్ మాత్రమే తమ ప్రయాణాన్ని లాభాల్లో కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో యాక్సిస్ బ్యాంక్, హిందాల్కొ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, గ్రాసిమ్, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎల్ టిఐఎమ్, టెక్ మహీంద్రా, విప్రో, దివీస్ ల్యాబ్స్, హీరో మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ముందుకు సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications