Budget Markets: దేశీయ స్టాక్ మార్కెట్లలో బడ్జెట్ జోష్ అస్సలు కనిపించలేదు. వాస్తవానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ మూడు నెలల కాలంలోని ఖర్చుల కోసం మాత్రమే ఉద్ధేశించబడి ఉంటుంది. దీంతో ప్రజాకర్షకమైన అంశాలను పెద్దగా పొందుపరచలేదు.
బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో స్వల్పంగా లాభాల్లో కొనసాగిన మార్కెట్లు నిర్మలమ్మ ప్రసంగాన్ని ముగించేనాటికి ఎరుపెక్కాయి. మధ్యాహ్నం 12.33 గంటల సమంయలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 38 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 23 పాయింట్లు కోల్పోయింది.

NSEలో మారుతీ, ఎస్బీఐ లైఫ్, సిప్లా, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, ఐషర్ మోటార్స్, ఐటీసీ, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఎల్ టి, డాక్టర్ రెడ్డీస్, ఎల్ టిఐఎమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఓఎన్జీసీ, గ్రాసిమ్, విప్రో, భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, టైటాన్, హిందాల్కొ, నెస్లే, కోల్ ఇండియా, అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్స్ కంపనీ షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications