Market Holidays: నవంబరులో స్టాక్ మార్కెట్ల సెలవులు ఇవే ఇన్వెస్టర్స్.. NSE, BSE క్లోజ్..
Market Holidays: నవంబర్ 2023లో దేశీయ స్టాక్ మార్కెట్లు మెుత్తం 10 రోజుల పాటు శెలవులో ఉండనున్నాయి. అలాగే దీపావళి సందర్భంగా ముహురత్ ట్రేడింగ్ కూడా ఈనెలలోనే ఉండటం విశేషం.
దేశంలో ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు BSE Sensex, NSE Nifty. ఇవి నవంబర్ నెలలో సాధారణ సెలవు దినాలతో పాటు పండుగ సెలవుల కారణంగా దాదాపు 10 రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ క్రమంలో ముందుగా నవంబర్ 14న దీపావళి బలిప్రతిపాదం సందర్భంగా, గురునానక్ జయంతి కారణంగా నవంబర్ 27న దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు క్లోజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దీపావళి బలిప్రతిపాదానికి ముందు నవంబర్ 12న ఆదివారం రోజున సాయంత్రం 6 నుంచి 7.15 వరకు ప్రత్యేకంగా ఒక గంట ట్రేడింగ్ కోసం తెరవబడతాయి.

మెుత్తంగా నవంబర్ నెలలో శెలవులను పరిశీలిస్తే.. నవంబర్ 4 శనివారం, నవంబర్ 5 ఆదివారం, నవంబర్ 11 శనివారం, నవంబర్ 12 ఆదివారం, నవంబర్ 14 దీపావళి, నవంబర్ 18 శనివారం, నవంబర్ 19 ఆదివారం, నవంబర్ 25 శనివారం, నవంబర్ 26 ఆదివారం, నవంబర్ 27 గురునానక్ జయవంతి సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు పనిచేయవు.
ముహురత్ ట్రేడింగ్ 2023..
ప్రస్తుతం అనేక మంది మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్లు వచ్చినందుకున వారికి ముహురత్ ట్రేడింగ్ అంటే ఏమిటో తెలియదు. దీపావళితో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుందని భారతీయుల నమ్మకం. అందుకే ఈరోజున ట్రేడింగ్ చేయటం మంచిని చేకూరుస్తుందని, అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని ఇన్వెస్టర్లు నమ్ముతుంటారు. అందుకే నవంబర్ 12న సాయంత్రం 6 నుంచి 7.15 గంటల వరకు మార్కెట్లు గంట పాటు ట్రేడింగ్ కొనసాగిస్తాయి. ఈ సమయంలో 15 నిమిషాల ప్రీఓపెనింగ్ ట్రేడ్ కూడా ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడిదారులు ఈక్విటీలతో పాటు, F&O కేటగిరీలో ట్రేడింగ్ చేసేందుకు అనుమతి ఉంటుంది.


Click it and Unblock the Notifications