Stock Market: సోమవారం స్టాక్ మార్కెట్స్ క్లోజ్.. ఎందుకో తెలుసా..??
Market Holiday: ఎన్నికల తర్వాత మరోసారి వారాంతంలో కాకుండా మరో రోజున దేశీయ స్టాక్ మార్కెట్లు క్లోజ్ అవుతున్నాయి. అయితే స్టాక్ మార్కెట్ల సెలవుదినాల వివరాలను ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాలి.
దేశీయ స్టాక్ మార్కెట్ రేపు అంటే 17 జూన్ 2024న మూసివేయబడుతుంది. బక్రీద్ పండుగ కారణంగా స్టాక్ మార్కెట్‌కు సెలవులో ఉండనున్నాయి. దీంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవుల అనంతరం జూన్ 18న మార్కెట్ తెరుచుకుంటుంది. BSE వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, SLB కూడా జూన్ 17న మూసివేయబడతాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా రేపు అంటే జూన్ 17న మూసివేయబడుతుంది. అయితే MCX సేవలు మార్కెట్ సాయంత్రం 5 గంటల తర్వాత తెరవబడతాయి.

2024లో స్టాక్ మార్కెట్ సెలవులు ఎప్పుడు?
ఈ ఏడాది స్టాక్ మార్కెట్‌లో 14 రోజులు సెలవులు ఉన్నాయి. ఇందులో రిపబ్లిక్ డే, మహాశివరాత్రి (8 మార్చి), హోలీ (25 మార్చి), గుడ్ ఫ్రైడే (29 మార్చి), రంజాన్ ఈద్ (ఏప్రిల్ 11), రామ నవమి (17 ఏప్రిల్), మహారాష్ట్ర డే (1 మే) సెలవులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీనికి తోడు భవిష్యత్తులోనూ మరికొన్ని రోజుల పాటు స్టాక్ మార్కెట్లు సెలవులను కలిగి ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళితే..
17 జూన్ (బక్రీద్)
17 జూలై (ముహర్రం)
ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం)
అక్టోబర్ 2 (మహాత్మా జయంతి)
నవంబర్ 1 (దీపావళి)
నవంబర్ 15 (గురునానక్ జయంతి)
25 డిసెంబర్ (క్రిస్మస్)
టాప్ 10 అత్యంత విలువైన సెన్సెక్స్ కంపెనీల్లో ఐదు మార్కెట్ క్యాప్ గత వారం ఏకంగా రూ.85,582.21 కోట్లు పెరిగింది. స్టాక్ మార్కెట్ సానుకూల ధోరణి మధ్య, ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లలో కోలాహలం కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications