Market Holidays 2025: మరో రెండు వారాల్లో దేశం కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతోంది. దీంతో స్టాక్ మార్కెట్ ట్రేడర్లు కూడా తమ కొత్త ఏడాది ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారికంగా స్టాక్ మార్కెట్లు వారాంతంలో సెలవులతో పాటు ఎప్పుడు మూతపడతాయనే అంశం గురించి చాలా మంది తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు 2025 మార్కెట్ హాలిడేస్ పైనే కొనసాగుతోంది.
ఈ క్రమంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ 2025లో తమ సెలవులకు సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించాయి. ఈ క్రమంలో మెుదటి సెలవు ఫిబ్రవరి 26, 2025న వస్తోంది. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ సెలవుల క్యాలెండర్ ప్రకారం 2025లో దాదాపు 14 రోజుల పాటు వివిధ కారణాల వల్ల స్టాక్ మార్కెట్లు అదనంగా సెలవులో ఉంటాయని తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది దీపావళి రోజున ప్రత్యేకంగా ఒక గంట పాటు నిర్వహించే ముహురత్ ట్రేడింగ్ అక్టోబర్ 21, 2025న నిర్వహించనున్నట్లు వెల్లడించబడింది.

2025లో భారతీయ స్టాక్ మార్కెట్లు సెలవులో ఉండే క్యాలెండర్ దినాల వివరాలు..
-ఫిబ్రవరి 26, 2025 (బుధవారం): మహాశివరాత్రి
-మార్చి 14, 2025 (శుక్రవారం): హోలీ
-మార్చి 31, 2025 (సోమవారం): రంజాన్
-ఏప్రిల్ 10, 2025 (గురువారం): శ్రీ మహావీర్ జయంతి
-ఏప్రిల్ 14, 2025 (సోమవారం): అంబేద్కర్ జయంతి
-ఏప్రిల్ 18, 2025 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే
-మే 01, 2025 (గురువారం): మహారాష్ట్ర దినోత్సవం
-ఆగస్టు 15, 2025 (శుక్రవారం): స్వాతంత్ర్య దినోత్సవం
-ఆగస్టు 27, 2025 (బుధవారం): గణేష్ చతుర్థి
-అక్టోబర్ 02, 2025 (గురువారం): మహాత్మా గాంధీ జయంతి/దసరా
-అక్టోబర్ 21, 2025 (మంగళవారం) దీపావళి లక్ష్మీ పూజ
-అక్టోబర్ 22, 2025 (బుధవారం): దీపావళి
-నవంబర్ 05, 2025 (బుధవారం): గురునానక్ జయంతి
-డిసెంబర్ 25, 2025 (గురువారం): క్రిస్మస్
ఈ క్రమంలో రానున్న 2025లో ఫిబ్రవరి, మే, నవంబర్, డిసెంబర్ మాసాల్లో కేవలం ఒక్క రోజు చొప్పున సెలవులు ఉండగా.. మార్చి, ఆగస్టులలో రెండు స్టాక్ మార్కెట్ సెలవులు వచ్చాయి. ఇక అత్యధికంగా మూడు రోజుల పాటు స్టాక్ మార్కెట్ సెలవులు ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఉండటం గమనార్హం. ఇదే క్రమంలో గణతంత్ర దినోత్సవం, శ్రీరామ నవమి, బక్రీద్ వంటి పండగులు స్టాక్ మార్కెట్ల వారాంతపు సెలవు రోజుల్లోనే వచ్చినందున ప్రత్యేకంగా అదనపు సెలవులు ఈ పండుగలకు రాలేదు. ఇక పోతే ఈ ఏడాది అంటే 2024లో చివరి అధికారిక స్టాక్ మార్కెట్ సెలవు డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా వస్తోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications