IPO News: మార్కెట్లోకి ఐపీవోల వరద.. ఇన్వెస్టర్స్ ఈ జాగ్రత్తలు పాటించంది..
IPO Investments: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఐపీవోలు వరద కొనసాగుతూనే ఉంది. ప్రధాన మార్కెట్లలోకి వచ్చేందుకు కంపెనీలు ఉర్రూతలూగుతున్న వేళ కొత్తగా సెబీ వద్ద దరఖాస్తులు చేసుకుంటున్న కంపెనీల లిస్ట్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వస్తున్న ఎస్ఎమ్ఈ ఐపీవోలతో జాగ్రత్తగా వ్యవహరించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సైతం ఇన్వెస్టర్లను హెచ్చరించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన నాటి నుంచి నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ బుల్ మార్కెట్లలో కంపెనీలు నిధుల సమీకరణ కోసం ఐపీవోను ఫ్లోట్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు సైతం ఐపీవోలపై క్రేజీ బెట్టింగ్స్ వేస్తూ డబ్బులు కుమ్మరిస్తున్నారు. ఐపీవోలపై బెట్టింగ్ వేయటం వల్ల కేవలం రోజుల్లోనే మంచి రాబడులను పొందాలని, లిస్టింగ్ గెయిన్స్ క్యాష్ చేసుకోవాలని వారు చూస్తున్నారు. అయితే ఇష్టమెుచ్చినట్లు ఐపీవోల్లో డబ్బు పెట్టడం, కంపెనీల గురించి పూర్తిగా అర్థం చేసుకోకపోవటం కొన్ని ఇబ్బందులకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఐపీవోల నుంచి మంచి రాబడులను అందుకోవాలంటే కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఓవర్ ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లు ఐపీవోల నుంచి నష్టాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది తమకు కంపెనీల గురించి తెలియకపోయినప్పటికీ తమ స్నేహితులు, ఆఫీసు కొలీగ్స్ సూచలన మేరకు పెట్టుబడులు పెడుతుంటారు. ఇలాంటి ఇన్వెస్టర్లు నష్టాల సుడిగుండంలో చిక్కుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఈ క్రమంలో సమస్యల్లో ఇరుక్కోకుండా ఉండాలంటే దానికి సరైన మార్గంలో పెట్టుబడులను కొనసాగించటం ఉత్తమమార్గం.
ఐపీవోల్లో పెట్టుబడులకు ముందు కంపెనీ వాల్యుయేషన్, భవిష్యత్తు, కంపెనీ ఉన్న రంగంలో ఉన్న గ్రోత్ అవకాశాలు, కంపెనీ భవిషత్తు గ్రోత్ ప్రణాళికలు వంటి వివరాలను గమనించాలి. కంపెనీ పనితీరును బట్టి వాల్యుయేషన్ ఉంటుందో లేదో కూడా ఇన్వెస్టర్లు గమనించాలి. ఇదే క్రమంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన మరికొన్ని విషయాలు కంపెనీ మేనేజ్‌మెంట్, ఫండమెంటల్స్ కూడా ఉన్నాయి. గ్రేమార్కెట్లో లిస్టింగ్ ముందు ప్రీమియం ఎలా ఉందనేది లిస్టింగ్ పై కొంత అవగాహనను అందిస్తుంది కాబట్టి దానిని కూడా గమనించాలి. కొత్త ఇన్వెస్టర్లు యూట్యూబ్ ఛానళ్లలోని వీడియాలు చూసి వారి సలహాలు, సూచనలతో పెట్టుబడులు పెట్టడం రిస్క్ అని గుర్తుంచుకోండి. ఇందుకోసమే స్వయంగా డీఆర్హెచ్పీ లోని వివరాలు స్వయంగా గ్రహించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది.
కొత్తనెల ప్రారంభం రోజున మెుత్తంగా 13 కంపెనీలు ఒకేరోజు మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ వద్ద తమ ఐపీవో ఫ్లోటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇది పెరుగుతున్న ఐపీవోల రాకను సూచిస్తుంది. వివరాల ప్రకారం ఐపీవో కోసం తాజాగా పత్రాలు దాఖలు చేసిన కంపెనీల జాబితాలో.. విక్రమ్ సోలార్, ఆదిత్య ఇన్ఫోటెక్, వరీంద్ర కన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీంతో పాటు అజాక్స్ ఇంజినీరింగ్, రాహి ఇన్‌ఫ్రాటెక్, విక్రాన్ ఇంజినీరింగ్, మిడ్‌వెస్ట్, విని కార్పొరేషన్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్, జారో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్, ఆల్ టైమ్ ప్లాస్టిక్స్ లిమిటెడ్, స్కోడా ట్యూబ్స్, డేవ్ యాక్సిలరేటర్ కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications