Market Crash: ఉదయం సరికొత్త గరిష్ఠాల వద్ద ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు కొద్ది నిమిషాల్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. వాస్తవానికి ఈ క్రమంలో షేర్ మార్కెట్ ప్రారంభం రికార్డు బద్దలు కొట్టింది. సెన్సెక్స్ 129 పాయింట్ల లాభంతో 80,481 కొత్త గరిష్ట స్థాయి వద్ద ప్రారంభం కాగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 24,459 వద్ద ప్రారంభమయ్యాయి. దీని తర్వాత మార్కెట్లు ఊహించని రీతిలో భారీ పతనాన్ని నమోదు చేశాయి.
నేడు ఇంట్రాడేలో గరిష్ఠంగా 900 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ సూచీ 11.36 గంటల సమయంలో 670 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 260 పాయింట్లకు పైగా ఇంట్రాడేలో నష్టాన్ని చవిచూడగా తర్వాత తేరుకుని 11.37 గంటల సమయంలో 196 పాయింట్లు కోల్పోయి ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 424 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 637 పాయింట్లు క్షీణించింది. ఈ క్రమంలో మార్కెట్లోని అన్ని రంగాలు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్-నిఫ్టీల్లో హెవీ వెయిట్స్ ఉన్న పెద్ద కంపెనీల షేర్లు ప్రధానంగా ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. దీంతో Reliance Industries, ICICI Bank, Tata Motors కంపెనీల షేర్లు నష్టాలను చూస్తున్నాయి. అలాగే అమెరికాతో పాటు ఇండియా ద్రవ్యోల్బణం డేటా విడుదల, క్యూ1 కార్పొరేట్ ఫలితాల విడుదలకు ముందు అప్రమత్తమైన ఇన్వెస్టర్లు నేడు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో మార్కెట్లలో భారీ కరెక్షన్ నమోదైనట్లు మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీలు అమ్మకాల ఒత్తిడి వల్ల కుప్పకూలటంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.7 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో బీఎస్ఈలో 208 స్టాక్స్ 52 వారాల కనిష్ట స్థాయిని తాకాయి. అలాగే కేవలం 21 షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లోని కంపెనీల షేర్లు టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి. అలాగే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు సైతం ప్రధానంగా పతనాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చాలా కాలంగా కొనసాగిన మార్కెట్ బుల్ ర్యాలీ బరస్ట్ అయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications