Stock Market Closing: ఉదయం ఉల్లాసంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు కొన్ని గంటల్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా క్షీణించాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే..??
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 526 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 155 పాయింట్ల మేర భారీ నష్టంతో ముగించాయి. ఇంట్రాడేలో సూచీలు కనిష్ఠాలను చేరుకున్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 297 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 233 పాయింట్ల మేర నష్టాలతో తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి. మార్కెట్లు ఒక్కసారిగా తలకిందులు కావటంతో దేశీయ పెట్టుబడిదారులకు సంపద దాదాపు రూ.15 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది.

అసలు మార్కెట్లు ఇంత భయంకరంగా మారటానికి కారణాలను పరిశీలిస్తే.. మిడిల్ ఈస్ట్‌లో భౌగోళిక రాజకీయ సంక్షోభం పెరగడం, USలో బాండ్ ఈల్డ్‌లు పెరగడం, కీలకమైన కార్పొరేట్‌ల సెప్టెంబర్ త్రైమాసిక ఆదాయాలు ఊహించిన దానికంటే బలహీనంగా ఉండటంతో అక్టోబర్ 25న భారీ అమ్మకాలను చూసింది.
ఈ అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఇన్వెస్టర్లు ముందుగానే జాగ్రత్త పడటం ప్రారంభించారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదంతో ముడిపడి ఉన్న అనిశ్చితులు సమీప కాలంలో మార్కెట్లపై ప్రభావం చూపుతూనే ఉంటాయని జియోజిత్ ఫైనాన్స్ కు చెందిన వికె విజయ్ కుమార్ వెల్లడించారు.
NSEలో టాటా స్టీల్, కోల్ ఇండియా, హిందాల్కొ, టాటా కన్జూమర్, ఎస్బీఐ, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, నెస్లే, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, ఐషర్ మోటార్స్, ఎన్టీపీసీ, ఎయిర్ టెల్, దివీస్ ల్యాబ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ , టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ టి, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీపీసీఎల్, గ్రాసిమ్, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని నేడు మార్కెట్లలో ముగించాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications