Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు అంతర్జాతీయ మార్కెట్లను అనుకరిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా మార్కెట్లు ఫ్లాట్ గా ముగియగా.. అంతర్జాతీయ మార్కెట్లలో నిక్కీ, షాంగై, హ్యాన్ శాంగ్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో భారత మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.
ఉదయం మార్కెట్ల ఓపెనింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ సూచీ పాయింట్ల 65 నష్టంలో ప్రారంభం కాగా.. నిఫ్టీ సూచీ 16 పాయింట్లను నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 20 పాయింట్ల నష్టాలతో ఉండగా.. నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ మాత్రం 39 పాయింట్ల లాభాల్లో కొనసాగుతోంది.

ప్రధానంగా అమెరికా మార్కెట్లలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గురించి వస్తున్న వార్తలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీనికి తోడు ఆసియా మార్కెట్లలోని సూచీలు దాదాపుగా నష్టాల్లో కొనసాగుతున్నందున ఆ సెంటిమెంట్ భారత ఇన్వెస్టర్లపై పడింది. దీనికి తోడు దేశంలో కంపెనీలు తమ క్యూ4 ఫలితాలను విడుదల చేస్తుండటం ఒడిదొడుకులకు కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
NSE సూచీలో ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ, ఎల్ టి, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, హిందాల్కొ, అల్ట్రాటెక్ సిమెంట్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, గ్రాసిమ్, భారతీ ఎయిర్ టెల్, బ్రిటానియా కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఇదే సమయంలో సూచీలో ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, హిందుస్థాన్ యూనిలివర్, హీరో మోటార్స్, టీసీఎస్, నెస్లే, టాటా కన్జూమర్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఆటో, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications