Stock Market: సూపర్ లాభాల్లో మెుదలైన సూచీలు.. రికార్డుల దిశగా సెన్సెక్స్-నిఫ్టీ..
Market Opening: శుక్రవారం సూచీల ర్యాలీలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గు చూపటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే నేడు కొత్త వారాన్ని సూచీలు భారీ లాభాల్లో మెుదలుపెట్టాయి. ఈ క్రమంలో గిఫ్ట్ నిఫ్టీ సైతం 100 పాయింట్లకు పైగా లాభపడి.. బుల్ జోరును కొనసాగిస్తోంది.
ఉదయం 9.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 232 పాయింట్లు లాభపడగా, మరో కీలక సూచీ నిఫ్టీ 60 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 90 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 130 పాయింట్ల మేర నేడు మార్కెట్ల ప్రారంభంలో లాభపడ్డాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న క్యూ4 ఫలితాల ప్రకటనతో పాటు సానుకూల గ్లోబల్ మార్కెట్ సంకేతాలు నేడు దేశీయ ఈక్విటీ మార్కెట్లను లాభాల్లో ముందుకు సాగేందుకు దోహదపడుతున్నాయి.

ఎన్ఎస్ఈలో కోటక్ బ్యాంక్, బ్రిటానియా, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా కన్జూమర్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మారుతీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఓఎన్జీసీ, ఎల్ టిఐఎమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నేడు ఇంట్రాడేలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో టైటాన్, ఎస్బీఐ, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటప్ ప్రైజెస్, బజాజ్ ఆటో, సిప్లా, పవర్ గ్రిడ్, దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్, బీపీసీఎస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ టి కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications