Stock Market: బలహీనంగా ఈక్విటీ మార్కెట్లు.. నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ..
Stock Market: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా ఒడిదొడుకులతో ముందుకు సాగుతున్నాయి. ప్రధానంగా అమెరికా, ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగటంతో.. ప్రీఓపెనింగ్ సమయంలో గిఫ్ట్ నిఫ్టీ బలహీనతను నమోదు చేసింది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 321 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ సైతం 107 పాయింట్లను కోల్పోయి ఇదే బాటలో ఇంట్రాడేలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ భారీగా 456 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 217 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. పార్సీ నూతన సంవత్సరం కారణంగా నేడు భారతీయ కరెన్సీ మార్కెట్లు సెలవులో ఉన్నాయి.

ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఐటీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టి, విప్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టీసీఎస్, ఎల్ టిఐఎమ్, బీపీసీఎల్, సెస్లే కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కొ, దివీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, టైటాన్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యూపీఎల్, బజాజ్ ఫిన్ సర్వీసెస్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో నిలిచాయి.


Click it and Unblock the Notifications