Stock Market: ఈ రోజు మార్కెట్ సూచీలు లాభాల్లో తమ ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తున్న తరుణంలో సూచీలు పాజిటివ్ గా ప్రతిస్పందిస్తున్నాయి.
ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు 9.23 గంటల సమయంలో సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో సూచీ నిఫ్టీ 46 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 126 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 70 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి.

అమెరికాలో పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్, సిల్వర్ గేట్ క్యాపిటల్ వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని ప్రముఖ టెక్ కంపెనీ ఎంఫసిస్ వెల్లడించింది. గుజరాత్ మెట్లో రైల్ కార్పొరేషన్ నుంచి రూ.282 కోట్ల ఆర్డర్ ను HFCL సొంతం చేసుకుంది. ఈ సారి జరగనున్న మానిటరీ పాలసీ సమావేశంలో కూడా వడ్డీ రేట్లను భారతీయ రిజర్వు బ్యాంక్ పెంచవచ్చని రాయిటర్స్ పోల్ ద్వారా వెల్లడైంది.
ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, హిందుస్థాన్ యూనీలివర్, ఎస్బీఐ లైఫ్, టాటా మోటార్స్, హీరో మోటార్స్, టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, హెట్సీఎల్ టెక్నాలజీస్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రిలయన్స్, టాటా స్ట్రీల్, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, హిందాల్కొ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, సిప్లా, విప్రో కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications