Stock Market: లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. బుల్స్ తిరిగొచ్చేశారు..!
Stock Market: వరుసగా ఒడిదొడుకుల్లో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల ఆరంభంలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలు దీనికి కారణంగా తెలుస్తోంది.
ఉదయం 9.29 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 202 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 62 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 151 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 162 పాయింట్ల లాభంలో ఉన్నాయి.

US సెనేట్ గురువారం నాడు అధ్యక్షుడు జో బిడెన్ మద్దతుతో ద్వైపాక్షిక చట్టాన్ని ఆమోదించింది. ఇది యూఎస్ ప్రభుత్వానికి ఉన్న 31.4 ట్రిలియన్ల రుణ పరిమితిని ఎత్తివేస్తుంది. నెలల తరబడి డెమొక్రాట్‌లు, రిపబ్లికన్‌ల మధ్య నెలల తరబడి జరిగిన చర్చల తర్వాత ఎట్టకేలకు బిల్ పాస్ అయ్యింది. లేకుంటే తొలిసారి డిఫాల్ట్ పరిస్థితి ఏర్పడేది. ట్రెజరీ జూన్ 5 వరకు చెల్లింపులకే సొమ్ము ఉందని గతంలోనే చెప్పింది. డెడ్ లైన్ దగ్గర పడుతున్న సమయంలో డెట్ సీలింగ్ పై నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లకు ఉపసమనం కల్పించింది.
NSEలో హీరో మోటార్స్, హిందాల్కొ, బ్రిటానియా, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, టైటాన్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, గ్రాసిమ్, ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే సమయంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, సిప్లా, ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications