Stock Market: లాభాల్లోకి Sensex, Nifty.. అసలు కారణం ఇదే..!
Market Opening: సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు పెద్దగా చలనం లేకుండా ఫ్లాట్ నోట్‌లో ట్రేడింగ్ ముగించాయి. ఈ క్రమంలో నేడు తిరిగి పుంజుకుని లాభాలతో తమ ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 315 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 89 పాయింట్ల మేర లాభపడింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 311 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 166 పాయింట్ల మేర లాభాలతో తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి. మార్కెట్లు ప్రీఓపెనింగ్ సెషన్లోనూ లాభాలతో ట్రేడింగ్ మెుదలుపెట్టాయి.

ప్రధానంగా సోమవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియటంతో గ్లోబల్ మార్కెట్లలో జోష్ మెుదలైంది. దీనికి తోడు సెప్టెంబర్ కార్పొరేట్ ఫలితాల ప్రారంభంపై ఇన్వెస్టర్లు, మార్కెట్లు, నిపుణులు ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ట్రాన్స్‌పోర్ట్, స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లు లాభపడటం కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.
NSEలో గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎల్ టిఐఎమ్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, విప్రో, యూపీఎల్, కోల్ ఇండియా, రిలయన్స్, దివీస్ ల్యాబ్స్, హిందాల్కొ, ఎస్బీఐ కంపెనీల షేర్లు మార్కెట్ల ఆరంభంలో లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హిందుస్థాన్ యూనీలివర్, బ్రిటానియా, ఓఎన్జీసీ, ఎల్ టి, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, బీపీసీఎల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications