Opening Bell: లాభాల్లో మెుదలైన సెన్సెక్స్, నిఫ్టీ.. కుమ్మేస్తున్న నిఫ్టీ మిడ్‌క్యాప్..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు మంచి లాభాలతో ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా కొనసాగుతున్న వేళ ఇండియన్ ఈక్విటీలు బుల్ జోరును గొనసాగుతున్నాయి.
ఉదయం 9.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 136 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో ఉన్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 34 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతున్నాయి. చివరిగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 685 పాయింట్ల భారీ లాభంతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో సోనా బీఎల్డబ్ల్యూ, బికాజీ ఫుడ్ కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో పవర్ గ్రిడ్, దివీస్ ల్యాబ్, ఎయిర్ టెల్, అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్స్, ఎల్ టిఐఎమ్, ఎన్టీపీసీ, టాటా కన్జూమర్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, సిప్లా, టాటా స్టీల్, ఓఎన్జీసీ, విప్రో, నెస్లే, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, హిందుస్థాన్ యూనీలివర్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications