Stock Market: బడ్జెట్ కి ముందు లాభాల ప్రారంభం.. కానీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ మూడ్ ఇదే..
Stock Market: కేంద్ర బడ్జెట్ సమావేశాలకు కేవలం ఒక్కరోజు ముందు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించటం సానుకూలతను ప్రతిబింబిస్తోంది. ఇది దేశంలోని ఇన్వెస్టర్ల ఆశావాదానికి అద్దం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో అమెరికా ఫెడ్ మీటింగ్ తో పాటు మరిన్ని గణాంకాలు రేటు వెల్లడి కావటం భారత్ కు చాలా కీలకంగా మారింది.

మార్కెట్ సూచీలు..
ఉదయం 9.16 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో శుభారంభం చేశాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 210 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 62 పాయింట్ల లాభంలో మెుదలైంది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 176 పాయింట్ల లాభంతో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 104 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ప్రారంభించాయి.

వెంటనే నష్టాల్లోకి..
సూచీలు లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఒడిదొడుకులు వెంటాడుతూనే ఉన్నాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. 9.20 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 127 పాయింట్లు, నిఫ్టీ 43 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 149 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 52 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, ఎస్బీఐఎన్, యూపీఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, రిలయన్స్, ఎల్ అండ్ టి, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, టైటాన్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు ఆరంభంలో లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..
ఇదే క్రమంలో ఎన్ఎస్ఈ సూచీలోని టెక్ మహీంద్రా, హిందాల్కొ, అపోలో హాస్పిటల్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బ్రిటానియా, విప్రో, కోల్ ఇండియా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications