Stock Market: బంపర్ లాభాలతో ప్రారంభమైన Sensex, Nifty.. నిఫ్టీ సరికొత్త రికార్డులు..
Opening Bell: నిన్న భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ఉదయం ఆరంభంలోనే సెన్సెక్స్ సూచీ 300 పాయింట్లకు పైగా లాభాలతో ఉండగా.. నిఫ్టీ నిన్నటి రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది.
ఉదయం 9.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 278 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 169 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 64 పాయింట్ల మేర లాభంతో ఇంట్రాడేలో ముందుకు సాగుతున్నాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, అమెరికా మార్కెట్లు లాభాల్లో కొనసాగటం సానుకూలంగానే కలిసొస్తోంది.

ఎన్ఎస్ఈలో ఎల్ టి, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, హిందాల్కొ, అల్ట్రాటెక్ సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జూమర్, పవర్ గ్రిడ్, టీసీఎస్, విప్రో, బజాజ్ ఆటో, సిప్లా కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అందానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనీలివర్, బీపీసీఎల్, నెస్లే, హెచ్డీఎఫ్సీ లైఫ్, మారుతీ, బ్రిటానియా, టైటాన్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ఇంట్రాడేలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications