Ram Mandir: జనవరి 22, 2024 భారత చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజుగా చెప్పుకోవచ్చు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించటానికి ఘనంగా ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి.
దీనిని దేశవ్యాప్తంగా ప్రజలు సైతం పెద్ద సంబురంలా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అందరూ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలు కల్పించే క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్టాక్ మార్కెట్లకు సోమవారం నాడు ప్రత్యేకంగా సెలవును ప్రకటించింది. వాస్తవానికి ఇది ప్లాన్ లో లేని ప్రత్యేక సెలవు. Negotiable Instruments Act- 1881 ప్రకారం పబ్లిక్ హాలిడేగా సోమవారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించటంతో రేపు మార్కెట్లు మూతపడనున్నాయి.

అలాగే మనీమార్కెట్ ఆపరేషన్స్ సోమవారం అంటే జనవరి 22న మూతపడనున్నట్లు రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. దీంతో ప్రభుత్వ సెక్యూరిటీల ట్రేడింగ్, ఫారెన్ ఎక్స్ చేంజ్, రూపీ ఇంటరెస్ట్ డెరివేటివ్స్ వంటి సాధనాలు సైతం ట్రేడ్ కావు. అయితే పెండింగ్ ఆర్డర్లు మంగళవారం అంటే జనవరి 23న సెటిల్ చేయబడతాయని రిజర్వు బ్యాంక్ స్పష్టం చేసింది.
అయితే రామ్‌లల్లా విగ్రహ ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకల్లో ప్రజలు పాల్గొనేందుకు సెలవు ప్రకటించటం ప్రభుత్వ రంగ సంస్థలను దుర్వినియోగం చేయటమేనని బ్యాంకు యూనియన్లు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్‌లలో నిరసనలకు దారితీశాయి.
ఇదిలా ఉండగా ఉద్యోగుల ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా, భారతదేశం అంతటా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలు జనవరి 22 మధ్యాహ్నం 2.30 గంటల వరకు సగం రోజు మూసివేయబడాలని జనవరి 18న డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ప్రకటించింది. ఇదే సమయంలో దేశంలోని కొన్ని ప్రైవేటు వ్యాపార సంస్థలు సైతం అయోధ్య శ్రీరాముని కార్యక్రమంలో తమ ఉద్యోగులు పాల్గొనేందుకు వీలు కల్పించాలనే సదుద్దేశంతో వారి ఆఫీసులకు సెలవును ప్రకటించాయి. మెుత్తానికి మార్కెట్లు సోమవారం నాడు తెరచుకోవని ఇన్వెస్టర్లు గమనించాలి.


Click it and Unblock the Notifications