Closing Bell: మార్కెట్ల సూపర్ బౌన్స్ బ్యాక్.. కాపాడింది ఆ రెండు రంగాలే..
Market Closing: ఉదయం నష్టాలతో ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి ఊహించని లాభాలను నమోదు చేశాయి. ప్రధానంగా ఇంట్రాడేలో ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన షేర్లు మార్కెట్ల పురోగతికి దోహదపడ్డాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 376 పాయింట్ల పెరుగుదలను చూడగా, మరో కీలక సూచీ నిఫ్టీ 84 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 541 పాయింట్ల భారీ పెరుగుదలను నమోదు చేసింది. ఇక చివరిగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 155 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. నేడు ఇంట్రాడేలో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లు మార్కెట్లో నష్టాలతో సూచీలను కిందకు లాగాయి. ఈ సమయంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు ఇన్వెస్టర్లను నష్టాల్లో ముంచాయి. ప్రాఫిట్ బుకింగ్ దీనికి కారణంగా నిపుణులు సూచిస్తున్నారు.

ఎన్ఎస్ఈలో హిందుస్థాన్ యూనీలివర్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, బ్రిటానియా, కోటక్ బ్యాంక్, టాటా కన్జూమర్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, దివీస్ ల్యాబ్, సిప్లా, నెస్లే, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, హిందాల్కొ, టాటా మోటార్స్, విప్రో, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా, టైటాన్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, సన్ ఫార్మా, మారుతీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications