Closing Bell: ఉదయం భారీ నష్టాల్లోకి జారుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ముగింపు సమయానికి తేరుకున్నాయి. వాస్తవానికి టీసీఎస్, హెచ్సీఎల్, విప్రో షేర్ల టార్గెట్ ధరను సీఎల్ఎస్ఏ పెంచటంతో ఐటీ షేర్లలో జోష్ కనిపించింది. దీనికి తోడు ప్రభుత్వ బ్యాంకులు మార్కెట్లకు వెన్నుగా నిలిచాయి.
సాయంత్రం మార్కెట్లు ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ నష్టాల నుంచి తేరుకున్న తర్వాత 27 పాయింట్ల స్వల్ప నష్టంలో నిలిచింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 19 పాయింట్లను కోల్పోయి ఫ్లాట్ ముగింపును నమోదు చేసింది. అయితే బ్యాంక్ నిఫ్టీ సూచీ 79 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 257 పాయింట్ల లాభపడి తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో ఓలటాలిటీ కారణంగా రియల్టీ షేర్లు మార్కెట్లను కిందకు లాగగా.. ఐటీ, పవర్ సెక్టార్ల కంపెనీలు గెయినర్లుగా నిలిచాయి.

ఎన్ఎస్ఈలో శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, దివీస్ ల్యాబ్, టీసీఎస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, హిందాల్కొ, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, విప్రో, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో నెస్లే, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, కోటక్ బ్యాంక్, బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా కన్జూమర్, రిలయన్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందుస్థాన్ యూనిలివర్, అపోలో హాస్పిటల్స్, మారుతీ, బీపీసీఎల్, టాటా స్టీల్, ఎల్ టి కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications