Market Closing: బెదరని భారతీయ స్టాక్ మార్కెట్లు..!!
Closing Bell: హిండెన్ బర్గ్ ఆరోపణలతో ఉదయం నష్టాల్లో మెుదలైన బెంచ్ మార్క్ సూచీలు ఆ తర్వాత తేరుకున్నాయి. అయితే ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ స్టాక్స్ పతనం మార్కెట్లను నష్టాల్లోకి లాగింది. కేవలం రియల్టీ రంగంలోని స్టాక్స్ లాభాలతో మార్కెట్లను ముందుకు నడిపించాయి.
మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 57 పాయింట్ల నష్టంతో ఉండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 20 పాయింట్ల మేర నష్టంతో నేడు ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 93 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 156 పాయింట్లు లాభాన్ని చూసింది. అలాగే బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 0.5 శాతం లాభంతో నేడు ప్రయాణం ముగించింది. సెబీ ఛైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్, ఆమె భర్తపై హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో భారతీయ ఈక్విటీ మార్కెట్ దృఢత్వాన్ని ప్రదర్శించింది. పర్యవసానంగా మార్కెట్ పదునైన కరెక్షన్ నుంచి తప్పించుకుంది.

ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, హీరో మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, హిందాల్కొ, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు లాభపడి టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ లైఫ్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, నెస్లే, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్జూమర్, రిలయన్స్, టీసీఎస్, బజాజ్ ఆటో, ఎల్ టి, అపోలో హాస్పిటల్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications