Stock Market: నిన్న మంచి లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేశాయి. ప్రధానంగా ఆసియా మార్కెట్ల సూచీలు బలహీనంగా ట్రేడింగ్ కొనసాగించటం దీనికి కారణంగా నిలిచింది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 52 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 17 పాయింట్లతో ముందుకు కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 11 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 197 పాయింట్ల మేర లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రీట్రేడింగ్ సెషన్ తో పాటు గిఫ్ట్ నిఫ్టీ సైతం ముందుగా ఫ్లాట్ ట్రేడింగ్ సూచికలను ఇచ్చాయి.

ఆస్ట్రేలియ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేయనున్న తరుణంలో ఆసియా మార్కెట్లు బలహీనంగా ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దక్షిణ కొరియా వార్షిక వినియోగదారు ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 3.4%కి పెరుగుదల కూడా ఒక కారణంగా ఉంది. మార్కెట్లో సిప్లా, హీరో మోటార్స్, ఎస్కార్ట్స్ కుబోటా షేర్లు నేడు మార్కెట్ల ప్రారంభంలో ఫోకస్ లో ఉన్నాయి.
ఎన్ఎస్ఈలో జియో ఫైనాన్షియల్స్, సిప్లా, గ్రాసిమ్, ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ టి, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, బీపీసీఎల్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, కోటక్ బ్యాంక్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో డాక్టర్ రెడ్డీస్, హిందాల్కొ, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్స్, బ్రిటానియా, పవర్ గ్రిడ్, ఎల్ టిఐఎమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications