Stock Market: దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడికానున్న వేళ స్టాక్ మార్కెట్లు కొత్త చరిత్ర లిఖిస్తూ ముందుకు సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలకు బెంచ్ మార్క్ సూచీలు ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి.
ఫిబ్రవరి 1, 2021 తర్వాత సెన్సెక్స్-నిఫ్టీలలో అతిపెద్ద వన్డే పెరుగుదల జూన్ 3, 2024 సోమవారం రోజున నమోదైంది. ఆ సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండు సూచీలు దాదాపు ఐదు శాతం బలపడ్డాయి. 2019 మే 20న 'ఎగ్జిట్ పోల్' తర్వాత కూడా సెన్సెక్స్-నిఫ్టీలు మూడు శాతానికి పైగా మాత్రమే లాభపడటం మనం చూశాం. ఇక మే 13, 2009 ఎగ్జిట్ పోల్ తర్వాత సెన్సెక్స్ 1.22 శాతం అంటే 146.74 పాయింట్లు పడిపోయింది. కానీ ఈసారి మార్కెట్లలో పరిస్థితులు పూర్తి భిన్నంగా కొనసాగుతున్నాయి.

పెరిగిన విశ్వాసంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ డబ్బును భారత స్టాక్ మార్కెట్‌లకు తీసుకొస్తున్నట్లు నిపుణులు అంటున్నారు. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో రూ.8,464 కోట్ల విలువైన షేర్లను వారు కొనుగోలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత సోమవారం రూ.6,850 కోట్లు పెట్టుబడి పెట్టారు. దీనికి ముందు గత కొన్ని రోజులుగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కొనసాగిన అనిశ్చితి కారణంగా వారు మే నెలలో భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.25,586 కోట్లను వెనక్కు తీసుకోవటం గమనార్హం.
వాస్తవానికి ఈ మెగా ర్యాలీతో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు భారీగా పెరిగాయి. నిన్న ట్రేడింగ్ ముగింపు నాటికి నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ 629.65 పాయింట్లు బలమైన జంప్‌తో 8,022 పాయింట్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇండెక్స్‌లో చేర్చబడిన బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు అత్యధికంగా 12.53 శాతం పెరిగాయి. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్ షేర్లు తొమ్మిది శాతానికి పైగా లాభపడ్డాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8 లక్షల కోట్లు దాటింది. ఈ ఘనత సాధించిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిలిచింది.
ర్యాలీలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు అత్యధికంగా 13.51 శాతం పెరిగాయి. దీని తరువాత గెయిల్, ఆర్‌ఈసీ లిమిటెడ్‌లలో కూడా 12 శాతం కంటే ఎక్కువ బలమైన వృద్ధిని సాధించాయి. అలాగే పవర్ కంపెనీలు, చమురు, ఇంధనం, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ కంపెనీల షేర్లు ఎనిమిది శాతం వరకు పెరిగాయి. నిన్న బీఎస్ఈ సెన్సెక్స్ మూడు శాతానికి పైగా పెరగడంతో ఒక్క ట్రేడింగ్ సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపదలో రూ.13.78 లక్షల కోట్ల భారీ పెరుగుదల నమోదైంది. ఈ రికార్డు స్థాయి పెరుగుదలతో, BSE లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,78,630 కోట్లు పెరిగి రూ.4,25,91,511.54 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు సైతం చెలరేగిపోయాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications