Stock Market: గరిష్ఠాలకు దగ్గరలో సూచీలు.. నిలబడతాయా..? కుప్పకూలతాయా..?
Stock Market: గతవారం లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త వారం ప్రయాణాన్ని ప్రారంభించాయి. అయితే ఈ క్రమంలో కీలక మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు తమ జీవితకాల గరిష్ఠాలకు సమీపంలో ట్రేడవుతున్నాయి.
ఉదయం 9.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 166 పాయింట్ల లాభంలో ట్రేడవుతుండగా.. మరో కీలక సూ చీ నిఫ్టీ 27 పాయింట్ల ముందంజలో కొననసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 44 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 146 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. భయాలను పక్కన పెట్టి కొత్త రికార్డుల వైపుకు భారత స్టాక్ మార్కెట్ల గమనం కొనసాగుతోంది.

ప్రధానంగా అంతర్జాతీయంగా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. అమెరికా నిక్కీ లాభపడగా.. చైనా, జపాన్ మార్కెట్ సూచీలు మాత్రం నష్టపోయాయి. అయితే ఆ ప్రభావం మన మార్కెట్లపై కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో మార్కెట్లు స్వల్ప నష్టాలను చూడొచ్చని తెలుస్తోంది. ఇదే క్రమంలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గుదల నమోదైంది. ఈ క్రమంలో మార్కెట్లు బుల్ జోరు కొనసాగిస్తాయా లేక కరెక్షన్ బాట పడతాయో వేచి చూడాల్సిందే.
ఎన్ఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ, దివీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, అదానీ ఎంటర్ ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ టి, టైటాన్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, హిందాల్కొ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఇండస్ ఇండ్ బ్యాంక్, హీరో మోటార్స్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, సిప్లా, బీపీసీఎల్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజుర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications