Market Opening: నిన్న లాభాల్లో ప్రయాణాన్ని ముగించిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో పాజిటివ్ స్టార్ట్ నమోదు చేశాయి. ప్రధానంగా అందరి చూపు రిజర్వు బ్యాండ్ మానిటరీ పాలసీపైనే ఉంది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 194 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 66 పాయింట్ల మేర లాభపడి ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 106 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 173 పాయింట్ల మేర లాభాలతో తమ ప్రయాణాన్ని మార్కెట్లో కొనసాగిస్తున్నాయి. సూచీలు మరింతగా లాభపడుతూ ముందుకు సాగుతున్నాయి.

ప్రధానంగా నేడు విడుదల కానున్న నెలవారీ ఉద్యోగాల రిపోర్టు కోసం అమెరికా మార్కెట్లు వేచి ఉన్న తరుణంలో స్వల్ప నష్టాల్లో నిన్న ట్రేడింగ్ ముగించాయి. అలాగే ఫెడ్ రానున్న కాలంలో చెప్పినట్లుగానే వడ్డీ రేట్లను పెంచొచ్చనే ధోరణి కూడా దీనికి కారణంగా నిలిచింది. అయితే ఆసియా మార్కెట్లు మాత్రం మంచి లాభాల్లో ఉండటం పాజిటివ్ సెంటిమెంట్లను కలిగిస్తున్నాయి. రేట్లలో రిజర్వు బ్యాంక్ మార్పులు చేయదని భావిస్తున్నప్పటికీ.. పెంపులు ప్రకటిస్తే మార్కెట్లు భారీగా నష్టాలను నమోదు చేయెుచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్ఎస్ఈలో సిప్లా, టైటాన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, హిందాల్కొ, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, హీరో మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, మారుతీ, టాటా కన్జూమర్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో నెస్లే, హిందుస్థాన్ యూనీలివర్, ఎయిర్ టెల్, బ్రిటానియా, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ఇండ్రాటే ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications