Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు వరుస సెలవుల తర్వాత తెరచుకున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ తొలిసారిగా 23,500 మార్కును అధిగమించి కొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకింది.
అమెరికా ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్న వేళ.. బెంచ్ మార్క్ సూచీలు జోరులో ఉన్నాయి. ఈ క్రమంలో ఉదయం 9.27 గంటలకు సెన్సెక్స్ సూచీ 173 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 63 పాయింట్ల మేర లాభంలో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 60 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 182 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తే యూఎస్ బాండ్ ఈల్డ్ పెరగటం, ఆయిల్ ధర తగ్గటం, ఆస్టేలిటాలో ద్రవ్యపరపతి సమావేశం నిర్ణయాల కోసం ఎదురుచూడటం వంటి అంశాలు ఉన్నాయి.

ఎన్ఎస్ఈలో విప్రో, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎల్ టిఐఎమ్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, ఎయిర్ టెల్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, హీరో మోటార్స్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, హిందాల్కొ, గ్రాసిమ్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో మారుతీ, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్, కోటక్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, రిలయన్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు ఇంట్రాడేలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications