Stock Market: స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్.. ముంచిన జియో ఫైనాన్సియల్స్..
Stock Market: నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు పాజిటివ్ నోట్ ప్రారంభంతో ముందుకు కదులుతున్నాయి.ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 46 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 20 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 105 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 140 పాయింట్ల లాభంలో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియటం దేశీయ మార్కెట్లను సానుకూలంగా ముందుకు నడిచేందుకు దోహదపడింది.
ముఖేష్ అంబానీకి చెందిన NBFC సంస్థ జియో ఫైనాన్సియల్ లిమిటెడ్ కంపెనీ షేర్లు నిన్న మార్కెట్లో లిస్ట్ అయిన నాటి నుంచి నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిన్న 5 శాతం నష్టంతో ట్రేడింగ్ ముగించిన స్టాక్.. ఈ రోజు సైతం 5 శాతం లోయర్ సర్క్యూట్ తాకి మార్కెట్ల ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకుంది.

ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, బీపీసీఎల్, కోటక్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజ్, ఎల్ టి, యూపీఎల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, హిందాల్కొ, విప్రో కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో జియో ఫైనాన్సియల్స్, మారుతీ, ఐషర్ మోటార్స్, నెస్లే, టీసీఎస్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, హిందుస్థాన్ యూనీలివర్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications