Indian Market: నిన్న సూపర్ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. నష్టాల్లో నేడు తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి. అయితే ఇంట్రాడేలో నిన్నటిలాగా తిరిగి పుంజుకునే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉదయం 9.20 గంటల సమయంలో సూచీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతుండగా.. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 193 పాయింట్ల నష్టంలో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 46 పాయింట్లు కోల్పోగా.. మరో సూచీ నిఫ్టీ బ్యాంక్ 55 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 15 పాయింట్ల స్వల్ప లాభంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో బజాజ్ ఆటో, టాటా స్టీల్, టీవీఎస్ మోటార్స్, డీఎల్ఎఫ్ కంపెనీల షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, బ్రిటానియా, హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, విప్రో, ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్, సిప్లా, టీసీఎస్, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, ఎయిర్ టెల్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, మారుతీ, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ సహా మరిన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో ముందుకు సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications