Stock Market: భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఫోకస్‌లో షుగర్ స్టాక్స్..
Opening Bell: గతవారం భారీగా ర్యాలీ అయిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రీ ఓపెనింగ్ సెషన్లోనూ ట్రేడింగ్ నష్టాల్లోనే కొనసాగింది.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 187 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 46 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 279 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 163 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ గరిష్ఠంగా 300 పాయింట్లకు పైగా భారీ నష్టాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లు పూర్తిగా ఓలటాలిటీలో కొనసాగుతున్నాయి. దీంతో వరుస మార్కెట్ లాభాలకు కొంత బ్రేక్ పడింది. అయితే లాభాల స్వీకరణ కూడా కొంత కారణంగా నిపుణులు చెబుతున్నారు.

ఎన్ఎస్ఈలో ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, టైటాన్, హీరో మోటార్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, హిందుస్థాన్ యూనీలివర్, యూపీఎల్, మారుతీ, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎయిర్ టెల్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా కంపెనీల షేర్లు మాత్రం లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, ఎల్ టిఐఎమ్ సహా మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications