Stock Market: లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. అమెరికా నుంచి వచ్చిన ఊరటతో..
Opening Bell: నిన్న లాభాల్లో ప్రయాణం ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా అమెరికాలో విడుదలైన ద్రవ్యోల్బమం డేటాతో పాటు ఆసియా, అమెరికా మార్కెట్ల సానుకూలతలు దీనికి దోహదపడ్డాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 217 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 62 పాయింట్ల లాభాలతో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 167 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 313 పాయింట్ల లాభాలతో ఇంట్రాడేలో ముందుకు సాగుతున్నాయి.

టాటా స్టీల్, హిందాల్కొ, యూపీఎల్, దివీస్ ల్యాబ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా, ఎస్బీఐ, విప్రో, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హీరో మోటార్స్, ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు లాభాలతో ఇంట్రాడేలో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనీలివర్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications