Stock Market Opening Bell: నిన్నంతా ఊగిసలాడుతూ చివరికి స్వల్ప లాభనష్టాల్లో ఇండెక్సులు మిగిశాయి. అయితే ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల పవనాల మధ్య ఇండీసెస్ మంచి లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఒపెనింగ్ గ్యాప్ అప్ తో ప్రారంభమైన బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ సూచీ ఉదయం 9.20 గంటలకు 585 పాయింట్ల లాభంలో, మరో కీలక సూచీ నిఫ్టీ 160 పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతున్నాయి. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ 397 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 260 పాయింట్లు ఎగబాకి మార్కెట్లు జోష్ లో కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో ఐషర్ మోటార్స్, హిందాల్కొ, కోల్ ఇండియా స్టాక్స్ ప్రధానంగా ఫోకస్ లో ఉన్నాయి. వీటికి తోడు టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ , టాటా కన్సల్టెన్సీ వంటి ఐటీ షేర్లు ప్రధాన్యం సంతరించుకున్ననాయి. ఇవే కాకుండా బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ కు చెందిన కొన్ని స్టాక్స్ సైతం గమనించదగ్గ మెుమెంటం కలిగి ఉన్నాయ

అమెరికాలో గ్యాసోలిన్ రేట్లు తగ్గుముఖం పట్టడంతో అక్కడ క్రమంగా ద్రవ్యోల్బణం తగ్గటం మార్కెట్లకు బూస్ట్ ఇచ్చింది. ఇదే సమయంలో మన దేశంలోనూ రిటైల్ ద్రవ్యోల్బణం జూలై మాసంలో కొంత అదుపులోకి రావటం ఇన్వెస్టర్లలో జోష్ నింపుతోంది. విప్రో కంపెనీ ఆస్ట్రేలియాలో సైబర్ సెక్యూరిటీ విభాగంలో విప్రో షిల్టేను లాంట్ చేయటం షేర్ పెరుగుదలకు కారణంగా నిలుస్తోంది.
ఇదే సమయంలో దేశీయ విమానయాన రంగానికి చెందిన వివిధ స్టాక్స్ సైతం ప్రభుత్వ ప్రకటనతో పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆగష్టు చివరి నాటికి డొమెస్టిక్ విమాన టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వం లిమిట్ తొలగించనున్నందున స్టాక్స్ పాజిటివ్ గా ప్రభావితం కావచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇలా అనేక పాజిటివ్ కారణాల మధ్య ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్ జోరును కొనసాగిస్తున్నాయి.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications