Market Opening: కొత్త ఏడాది ప్రారంభం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను భయాలు వెంటాడుతున్నాయి. మార్కెట్లు ఇంకెంతకాలం ర్యాలీని కొనసాగిస్తాయనే ఆందోళనలు ఒడిదొడుకులకు కారణం అవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి ముందుకు అడుగేస్తున్నారు.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 117 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 25 పాయింట్ల మేర నష్టంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 148 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. అయితే కేవలం మిడ్ క్యాప్ సూచీ మాత్రం ఈ సమయంలో 64 పాయింట్ల స్వల్ప లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. చాలా మంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి.

న్యూ ఇయర్ కారణంగా అమెరికా మార్కెట్లు సోమవారం సెలవులో ఉన్నాయి. ఈ క్రమంలో ఏడాది తొలిరోజున దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభ ట్రేడింగ్ కంటే కొంచెం ఎగువన ముగించింది. ప్రధానంగా మార్కెట్లలో అలుముకున్న అస్థిరత నిన్న నిఫ్టీ ట్రేడింగ్ లో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం నిఫ్టీకి కీలకమైన రెసిస్టెన్స్ జోన్ 22000 వద్ద ఉంది. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులతో పాటు అమెరికాకు సంబంధించిన గణాంకాలు ఈవారం మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో ఊగిసలాటలు కొనసాగుతున్నాయి.
ఎన్ఎస్ఈలో దివీస్ ల్యాబ్, టాటా కన్జూమర్, సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, నెస్లే, ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్, టాటా మోటార్స్, యూపీఎల్, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, రిలయన్స్, బజాజ్ ఆటో సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, అదానీ పోర్ట్స్, హీరో మోటార్స్, ఎల్ టి, గ్రాసిమ్, హిందుస్థాన్ యూనీలివర్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, విప్రో, కోటక్ బ్యాంక్ సహా మరిన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications