Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. వెంటాడుతున్న అమెరికా ద్రవ్యోల్బణం.. పడిపోతున్న IT స్టాక్స్..
Stock Market Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ప్రధానంగా అమెరికాలో ద్రవ్యోల్బణం గణాంకాలు తాజాగా విడుదల కావటం అంతర్జాతీయ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా స్టాక్ మార్కెట్ క్షీణించాయి. ప్రస్తుతం ఆ ప్రభావం భారత మార్కెట్లపైనా పడింది.

మార్కెట్ సూచీలు ఇలా..
సెన్సెక్స్ 950 పాయింట్లు, నిఫ్టీ సూచీ 280 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 470 పాయింట్లను ఆరంభంలో కోల్పోయాయి. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ 335 పాయింట్లు పతనమైంది. అయితే ఆరంభ నష్టాల నుంచి మార్కెట్లు కొంత పుంజుకుని నష్టాలను తగ్గించుకున్నాయి. అమెరికా మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి దేశీయ మార్కెట్లలోనూ కనిపిస్తోంది.

వడ్డీరేట్ల పెంపు..
భారత్‌లో ద్రవ్యోల్బణం గణాంకాలు సోమవారం విడుదలయ్యాయి. దీని తరువాత.. మంగళవారం USలో ద్రవ్యోల్బణం డేటా విడుదలయ్యాయి. రెండు దేశాల్లోనూ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి US ఫెడ్ వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించింది. యూఎస్ ఫెడ్ తర్వాత, ఆర్‌బిఐ కూడా భారతదేశంలో వడ్డీ రేట్లను పెంచుతుందని భావిస్తున్నారు.

గెయినర్స్ అండ్ లూజర్స్..
ఎన్టీపీసీ, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టాటా కన్జూమర్ స్టాక్స్ ఆరంభంలో లాభాలతో ప్రారంభమై టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో టెక్ మహీంద్రా, ఇన్భోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, టాటా మోటార్ స్టాక్స్ ఆరంభంలో నష్టాపోయి టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.

ఐటీ కంపెనీలు..
అమెరికా మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం కావటం వల్ల ఎక్కువగా ఐటీ కంపెనీల షేర్లు ఈరోజు భారీగా నష్టపోయాయి. ఇదే సమయంలో అనేక ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించటం ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమౌతోంది.


Click it and Unblock the Notifications