Market Opening: అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు మాత్రం స్వల్పంగా లాభాలతో తమ ప్రయాణాన్ని నేడు ప్రారంభించాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 278 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 74 పాయింట్ల మేర లాభంలో తన ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 297 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 119 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతున్నాయి. ప్రధానంగా అమెరికాతో పాటు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ భారత మార్కెట్లు మాత్రం పుంజుకున్నాయి.

ప్రధానంగా కొనసాగుతున్న నిరాశావాద వాతావరణం మధ్య దలాల్ స్ట్రీట్‌లో తిరిగి బుల్స్ జోరు నేడు మెుదలైంది. కొత్త ఏడాది ప్రారంభమైన తర్వాత నిఫ్టీ సూచీ సవాలుతో కూడిన ప్రారంభాన్ని ఎదుర్కొంది. ఈ క్రమంలో మొదటి మూడు ట్రేడింగ్ రోజులు ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా మార్కెట్లలో క్షీణత, ఫెడ్ ద్వారా ముందస్తు రేట్ల తగ్గింపుల కోసం పందెం తగ్గడం, US ట్రెజరీ నోట్‌లో పెరిగిన దిగుబడులు ఆందోళనకు దోహదం చేస్తాయి. దీనికి తోడు ఇన్వెస్టర్లు క్యూ3లో ఐటీ కంపెనీల ఆదాయాలపై ఆందోళనకరమైన అంచనాలతో జాగ్రత్త పడుతున్నారు.
NSEలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఎల్ టిఐఎమ్, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, టీసీఎస్, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో బీపీసీఎల్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, మారుతీ, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, హిందాల్కొ, ఎయిర్ టెల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications