Stock Market: లాభాల్లో మార్కెట్లు కళకళ.. ఇరగదీస్తున్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్..
Market Opening: నిన్న భారీ అస్థిరత తర్వాత చివరికి ప్లాట్ ముగింపును నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలో నేడు బీహెచ్ఈఎల్, అపోలో టైర్స్, రాంకో సిస్ట్మ్ కంపెనీల షేర్లు ప్రధానంగా ఫోకస్ లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 36 పాయింట్ల స్వల్ప లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 13 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం భారీగా 160 పాయింట్లను కోల్పోయింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 255 పాయింట్లు ఎగబాకి లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లలో ఎన్నికల ఓలటాలిటితో కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ, ఎల్ టిఐఎమ్, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ యూనీలివర్, రిలయన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, టీసీఎస్, విప్రో, టాటా కన్జూమర్, బ్రిటానియా, ఎల్ టి, సిప్లా, ఐటీసీ, టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో సన్ ఫార్మా, హీరో మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, పవర్ గ్రిడ్, హిందాల్కొ, మహీంద్రా అండ్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications