Markets Opening: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ 3.0 ప్రభుత్వం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ కోసం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసే ప్రకటనలు ఏఏ రంగాలపై ప్రభావాన్ని చూపుతాయి, రానున్న కాలంలో ప్రభుత్వ ఫోకస్ ఏఏ రంగాలపై ప్రధానంగా ఉందనే అంశాన్ని నేటి బడ్జెట్ తెలియజేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలో నేడు ఉదయం 9.15 గంటలకు బెంచ్ మార్క్ సూచీలు తమ ప్రయాణాన్ని లాభాల్లో నేడు ప్రారంభించాయి. ఈక్విటీ మార్కెట్లపై బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనల మధ్య ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ సూచీ 41 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. ఈ సారి బడ్జెట్లో కేంద్రం ప్రకటించే సానుకూలతలు అభివృద్ధికి దోహదపడతాయని అందరూ భావిస్తున్నారు. అయితే వారి అంచనాలు తలకిందులైతే మార్కెట్లు క్రాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే జెఫరీస్ నిపుణులు హెచ్చరించారు.

NSEలో అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, గ్రాసిమ్, ఎల్ టి, అదానీ ఎంటర్ ప్రైజెస్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ లైఫ్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని మెుదలుపెట్టాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కొ, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, బ్రిటానియా, ఎల్ టిఐఎమ్, ఎయిర్ టెల్, టాటా మోటార్స్, టాటా కన్జూమర్, సిప్లా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications