Stock Market: పద్దతిగా పైపైకి పయనిస్తున్న మార్కెట్లు.. Sensex, Nifty పాజిటివ్..
Stock Market: నిన్న స్వల్ప ఒడిదొడుకుల్లో క్లోజ్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం పాజిటివ్ ఆరంభంతో మెుదలయ్యాయి. ఫోకస్‌లో ఉన్న స్టాక్స్ ఇవే..
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ నెస్సెక్స్ 169 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 44 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 165 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 88 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. మార్కెట్ల అంచనాలను అందుకున్న ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ ప్రధానంగా ఫోకస్ లో ఉంది.

ఈరోజు ఉదయం బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ తన ప్రయాణాన్ని 67,000 పాయింట్లకు పైన రికార్డు స్థాయిలో ప్రారంభించింది. చైనా ఆర్థికం తిరిగి పుంజుకోవటంతో పాటు సప్లై తగ్గింపు కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా మళ్లీ పెరగటం ప్రారంభించాయి.
ఎన్ఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్ బ్యాంక్, బీపీసీఎల్, టాటా కన్జూమర్, టీసీఎస్, టైటాన్, టాటా స్టీల్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్రిటానియా కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
ఇదే సమయంలో మారుతీ, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటార్స్, సిప్లా, భారతీ ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, నెస్లే, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్, హిందాల్కొ, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications