Stock Market: లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్, నిఫ్టీ.. ఇజ్రాయెల్ దూకుడు ఎఫెక్ట్..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాలను కొనసాగింపుతో ఇవాళ శుభారంభాన్ని మెుదలుపెట్టాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను తెహ్రాన్ లో మట్టుపెట్టినట్లు ప్రకటించటం గ్లోబల్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపిస్తోంది.
ఈ క్రమంలో బెంచ్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ ఉదయం 200 పాయింట్ల లాభంతో ప్రయాణఆన్ని ప్రారంభించినప్పటికీ 9.36 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 78 పాయింట్లు లాభపడగా, మరో కీలక సూచీ నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 41 పాయింట్ల నష్టంతో ఒడిదొడుకుల్లో కొనసాగుతోంది. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 279 పాయింట్ల లాభం మధ్య ముందుకు సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లు నిదానంగా తేరుకుంటున్నాయి.

ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, బీపీసీఎల్, హిందాల్కొ, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎల్ టి, అదానీ పోర్ట్స్, హీరో మోటార్స్, మారుతీ, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్రిటానియా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో టాటా కన్జూమర్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ, టైటాన్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, కోటక్ బ్యాంక్, టీసీఎస్, సిప్లా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications