Stock Market: గ్లోబల్ మార్కెట్లకు ఎదురీదుతున్న సెన్సెక్స్, నిఫ్టీ.. ఏమైందంటే??
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల ముగింపు తర్వాత నేడు లాభాలతో ప్రయాణాన్ని ప్రారంభించాయి. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నప్పటికీ.. భారతీయ మార్కెట్లు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో NBCC, Zomato, Zydus Life కంపెనీల షోర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.22 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో ఉండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 22 పాయింట్ల మేర లాభంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 54 పాయింట్ల మేర నష్టంతో ముందుకు సాగుతోంది. ఇక చివరిగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 114 పాయింట్ల లాభంతో ముందుకు కొనసాగుతోంది. వాస్తవానికి ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో భారతీయ సూచీలు ఫ్లాట్ ఆరంభాన్ని చూశాయి.

ఎన్ఎస్ఈలో ఎల్ టిఐఎమ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, విప్రో, పవర్ గ్రిడ్, బీపీసీల్, సన్ ఫార్మా, టైటాన్, ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, ఎల్ టి, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా కన్జూమర్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, హీరో మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, నెస్లే, అదానీ ఎంటర్ ప్రైజెస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, దివీస్ ల్యాబ్, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications